Narendra Modi Telangana Tour: తెలంగాణకు నరేంద్ర మోదీ.. ఎన్ని రోజులు ఉంటారంటే?
తెలంగాణలో వీలైనన్ని పార్లమెంట్ స్థానాలు సొంతం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ
Narendra Modi Telangana Tour:తెలంగాణలో వీలైనన్ని పార్లమెంట్ స్థానాలు సొంతం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. తమ పోటీ కాంగ్రెస్ పార్టీతోనే అని.. బీఆర్ఎస్ కు అసలు అవకాశమే ఇవ్వొద్దని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఫలితాలను పక్కన పెడితే.. తెలంగాణ ఓటర్లు పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీకి అప్పజెప్పుతారని ఆశలు పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. ఇక ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీని దింపడానికి సిద్ధమయ్యారు.
మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కొనసాగనుంది. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. మార్చి 4వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. మోదీ పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. మార్చి 4న ఆదిలాబాద్ జిల్లాలో మోదీ పర్యటన ఉండగా.. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆదిలాబాద్ లో బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మార్చి 4 రాత్రి హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ప్రధాని మోదీకి బస ఏర్పాటు చేశారు. మార్చి 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటన ఉండనుంది. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఆయన. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొననున్నారు. అనంతరం ఢిల్లీకి ఆయన తిరుగుప్రయాణం చేయనున్నారు. తెలంగాణలో సైతం మొత్తం 17 సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికలను రచిస్తూ ఉంది.