బండి సంజయ్ కు నోటీసులు

బండి సంజయ్ కి 41 A సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.;

Update: 2022-06-14 07:35 GMT
bandi sanjay, bjp, kcr, kashmir files,old city files , paddy purchase
  • whatsapp icon

బండి సంజయ్ కి 41 A సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ఆవిర్భావం రోజున ఉద్యమ కారుల సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్కిట్ వేసినందుకు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇటీవల బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కేసీఆర్ కు వ్యతిరేకంగా...
తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున నాగోలు లో జరిగిన అమరవీరుల బహిరంగ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ ను విమర్శిస్తూ వేసిన స్కిట్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో హయత్ నగర్ పోలీసులు బీజేపీ నేతలు అరెస్ట్ చేయడమే కాకుండా, రాణిరుద్రమ, దరువు ఎల్లన్నలను అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News