జేపీ నడ్డాకు షాకిచ్చిన పోలీసులు

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనే ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు;

Update: 2022-01-04 06:05 GMT
bjp, jp nadda, begumpet, rally, mahatma gandhi statue
  • whatsapp icon

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనే ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అందరూ కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని డీసీపీ చందనా దీప్తి తెలిపారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం నుంచి లిబర్టీ వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

ర్యాలీకి నో పర్మిషన్....
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. కానీ కోవిడ్ నిబంధనలను అనుసరించి ర్యాలీకి అనుమతి ఇవ్వడం లేదని డీసీపీ చందనాదీప్తి తెలిపారు. కరోనా నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.


Tags:    

Similar News