Pending Challans : రాయితీ గడువు నాలుగు రోజులే
వాహనాల పెండింగ్ చలాన్లకు సంబంధించి రాయితీ గడువు నాలుగు రోజులు మాత్రమేనని పోలీసులు తెలిపారు
వాహనాల పెండింగ్ చలాన్లకు సంబంధించి రాయితీ గడువు నాలుగు రోజులు మాత్రమేనని పోలీసులు తెలిపారు. రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు ఇప్పటికే గడువు పెంచింది. డిసెంబరు27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు పెద్దయెత్తున వాహనదారులు స్పందిస్తారని పోలీసులు భావించారు. అయితే హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రం వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు.
ఈ నెల 31వ తేదీ వరకూ...
అయినా ఈ నెల 31వ తేదీ వరకూ రాయితీతో పెండింగ్ చలాన్ల గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.52 కోట్ల మంది మాత్రమే చెల్లంచారు. దాని ద్వారా 135 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది. రాయితీ గడువు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో వాహనదారులు చెల్లించి క్లియర్ చేేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రాయితీ గడువు పెంచే అవకాశం లేదని చెబుతున్నారు.