ముర్ము వచ్చి ఉపయోగం ఏంటి?
రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఆమె ఈరోజు సాయంత్రం హైదరాబాద్ రావాల్సి ఉంది
రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఆమె ఈరోజు సాయంత్రం హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా ఆమె పర్యటన వాయిదా పడింది. ద్రౌపది ముర్ము తెలంగాణ వచ్చి కూడా ఉపయోగం లేదనే వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. ఎక్కువ ఓట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన తర్వాత ఆమె ఇతర రాష్ట్రాలకు వెళ్లనున్నారు. తెలంగాణలో ఓట్లు లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
ప్రధాన పార్టీలన్నీ....
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఆయనకే మద్దతు తెలిపింది. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం తెలంగాణకు రావాల్సి ఉంది. వచ్చినా రాకపోయినా పెద్దగా ఫరక్ పడదు. బీజేపీకి ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. అందుకే ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటనను రద్దు చేసుకుని ఇతర రాష్ట్రాల ప్రచారానికి వెళ్లినట్లు చెబుతున్నారు.