మోదీ వస్తున్నారు... అన్న ఏం చేస్తారో?

ప్రధాని మోదీ ఈ నెల 12న తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు.

Update: 2022-11-05 03:26 GMT

మరోసారి మోదీ పర్యటనకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ ఈ నెల 12న తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అయితే ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది సందేహమే. కేసీఆర్ అదే సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీకి వెళతారని...
గతంలోనూ మోదీ తెలంగాణ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పర్యటనలకు దూరంగా ఉన్నారు. తన ఆరోగ్యం బాగాలేదని ఒకసారి, ఇతర రాష్ట్రాల పర్యనలో మరోసారి మోదీ పర్యటనకు దూరంగా ఉన్నారు. ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలికే కార్యక్రమంలో పాల్గొనలేదు. కేవలం మంత్రులు మాత్రమే పాల్గొన్నారు. దీంతో ఈ సారి కూడా ఈ నెల 12న కేసీఆర్ ప్రధాని పర్యటనకు హాజరు కారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇటీవల ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం, మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగిందని చెబుతున్నారు. దీంతో కేసీఆర్ మోదీ పర్యటనకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News