నేడు నిజామాబాద్‌కు మోదీ
రెండు రోజులు వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నేడు తెలంగాణకు రానున్నారు
రెండు రోజులు వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నేడు తెలంగాణకు రానున్నారు. ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు బీదర్ నుంచి బయలుదేరి నిజామాబాద్ చేరుకునే ప్రధాని తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగిస్తారు. మొత్తం ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. న్రధాని సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలు జనసమీకరణను పెద్దయెత్తున చేస్తున్నారు.
అభివృద్ధి పథకాలకు...
మధ్యాహ్నం 3.45 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ ప్రాంగణానికి ఇందూరు గర్జన అని పేరు పెట్టారు. ఇక్కడ ప్రసంగించిన అనంతరం తిరిగి బీదర్ కు ప్రధాని బయలుదేరి వెళతారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ రామగుండంలో ఎన్టీపీసీ చేపట్టిన పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు విలువ ఆరువేల కోట్ల రూపాయలు. అనంతరం సిద్ధిపేట - మనోహరాబాద్ మధ్య నిర్మించిన 76 కిలోమీటర్ల తొలి రైలు సర్వీసును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఆయుష్యాన్ భారత్ కింద అనేక జిల్లా కేంద్రాల్లో నిర్మించిన ఐసీయూ యూనిట్లను ఆయన ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు.