మళ్లీ వర్షాలు.. తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. ఏపీ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం

Update: 2023-08-14 02:41 GMT

తెలంగాణలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. ఏపీ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా మయన్మార్, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న మేఘాలు తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి. ఆ మేఘాలు తెలుగు రాష్ట్రాలపై ప్రస్తుతం ఆవరించి ఉండడంతో నేటి నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్, మల్కాజ్‌గిరి, యాదాద్రి- భువనగిరి, సిద్ధిపేట, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆవర్తన కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాలపై ఆవర్తన ప్రభావం ఉంటుందని.. అక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.

ఏపీలో సోమవారం చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కోనసీమ, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం , ఏలూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ఏలూరు, ఎన్టీఆర్, కోనసీమ, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో గత కొన్ని రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వర్షాలు కాస్త ఉపశమనం కలిగించనున్నాయి.


Tags:    

Similar News