నేటితో ముగియనున్న సహస్రాబ్ది వేడుకలు
ముచ్చింతల్ లో జరుగుతున్న రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి
ముచ్చింతల్ లో జరుగుతున్న రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజున సహస్ర కుండలాల యజ్ఞానికి మహాపూర్ణాహుతి పలకనున్నారు. ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు ఈ నెల 2వ తేదీన ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించాలని చినజీయర్ స్వామి నిర్ణయించారు.
చివరిరోజున...
ప్రధాని నరేంద్రమోదీ సమాతమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గత పది రోజులుగా ఎందరో భక్తులు సమతామూర్తిని దర్శించుకున్నారు. ఇక్కడ నిర్మించిన 108 ఆలయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈరోజు జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.