Revanth Reddy : ప్రగతి భవన్‌కు ఎవరైనా రావచ్చు... రేపటి నుంచే ప్రజాదర్బార్

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు గ్యారంటీలపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు

Update: 2023-12-07 08:44 GMT

Rythu bandhu

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు గ్యారంటీలపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలైన రజనీకి ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులపై రేవంత్ రెడ్డి సంతకం చేశారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.

తొలి సంతకం దాని మీదనే...
ఎన్నికల సమయంలో తెలంగాణలో ఉపాధి లేకుండా ఉండి తన వద్దకు వచ్చిన రజనీకి తాము అధికారంలోకి రాగానే ఉద్యోగమిస్తామని చెప్పారు. దీంతో ఆమెకు ఉద్యోగమిస్తూ రూపొందించిన ఫైలుపై సంతకంచేశారు. రజనీకి అపాయింట్‌మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. దీంతో రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేసే దిశగా మొదటి అడుగు వేసిందని చెప్పాలి.

పాలకులం కాదు సేవకులం...
రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ జై సోనియమ్మ అంటూ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దశాబ్దకాలం నుంచి తెలంగాణ రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఉక్కు సంకల్పంగా మార్చి ప్రజలు ప్రజా రాజ్యాన్ని తెచ్చుకున్నారన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, రైతులకు, ఉద్యమకారులకు, నిరుద్యోగులకు, యువతకు మంచి జరుగుతుందన్నారు. సామాజిక న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మాట ఇస్తున్నా... ప్రగతి భవన్ కు ఎప్పుడైనా వచ్చే వీలు కల్పిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రజలు ప్రభుత్వంలో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. రేపటి నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తామని చెప్పారు. తాము పాలకులం కాదని సేవకులమేనని ఆయన అన్నారు


Tags:    

Similar News