నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ
నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది.;

నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది. ఉదయం 11 గంటలకు భేటీకానున్న కేబినెట్ సబ్‌కమిటీ ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేయనుంది. ఈ మేరకు నిన్ననే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. జీవో తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిటీ సభ్యులు అందచేయనున్నారు.
మూడు గ్రూపులుగా...
ఎస్సీ వర్గీకరణ మొత్తం మూడు గ్రూపులుగా చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి పదిహేను శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. మూడు గ్రూపులుగా వర్గీకరణ చేయనున్న ప్రభుత్వం మొదటి గ్రూప్‌లో ఉన్నవారికి ఒకశాతం వర్తించేలా, రెండో గ్రూప్‌లో ఉన్నవారికి 9 శాతం రిజర్వేషన్లు వర్తించేలా, మూడో గ్రూప్‌లో ఉన్నవారికి 5 శాతం వర్తించేలా జీవోను విడుదల చేయనున్నారు.