రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రద్దు
రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పని చేస్తాయని స్పష్టం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ ..
ప్రతినెలలో రెండో శనివారం స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుంటుంది. కానీ ఈ నెలలోని రెండో శనివారంలో మాత్రం సెలవు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పని చేస్తాయని స్పష్టం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 9వ తేదీన ప్రభుత్వం సాధారణ సెలవుదినంగా ప్రకటించింది. ఆ సెలవును భర్తీ చేసేందుకు రెండో శనివారం పని చేయాల్సి ఉంటుందని అప్పుడే తెలిపింది. ఈ క్రమంలోనే నవంబర్ 12వ తేదీన సెలవుని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయి.