హిమాయత్ సాగర్ కు పెరిగిన వరద.. ఓఆర్ఆర్ రోడ్డు మూసివేత
ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద ప్రవాహం హిమాయత్ సాగర్ జలాశయానికి వస్తుండటంతో.. వరద నీరు పొంగిపొర్లుతుంది.
గత మూడు రోజులుగా కురిసిన వర్షాలు కారణంగా వాగులో వంకలు పొంగిపొర్లతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ ఎత్తున వరద నీరు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద ప్రవాహం హిమాయత్ సాగర్ జలాశయానికి వస్తుండటంతో.. వరద నీరు పొంగిపొర్లుతుంది. వరద ప్రవాహం ఎక్కువ అవ్వడంతో అధికారులు మరో రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు.
జలమండలి అధికారులు మొత్తం ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. హిమాయత్ సాగర్ నుండి రాజేంద్రనగర్ వైపు వెళ్లే ఓఆర్ ఆర్ సర్వీస్ రోడ్డు మూసివేశారు. రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఓఆర్ ఆర్సర్వీస్ రోడ్డు వద్ద ఇరువైపుల భారీ కేట్స్ ఏర్పాటు చేశారు. వాహనదారులు అటుగా వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు నుండి వాహనదారులు వెళ్లవలసిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.