ఈ రైళ్లను రద్దు చేశాం: దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్‌ నగరంలో పలు మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే;

Update: 2023-12-24 05:29 GMT
mmts, southcentralrailway, mmtstrains, trains, telangana news, railway news, india

southcentralrailway

  • whatsapp icon

హైదరాబాద్‌ నగరంలో పలు మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసినట్లు తెలిపింది. పలు ఆపరేషనల్‌ కారణాలతో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. ప్రయాణికులు తమకు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. సికింద్రాబాద్‌, లింగంపల్లి, ఉందానగర్‌, ఫలక్‌నుమా మార్గాల్లో నడిచే పలు రైళ్లు రద్దు అయ్యాయి. రామచంద్రపురం-ఫలక్‌నుమా, మేడ్చల్-సికింద్రాబాద్, ఫలక్‌నుమా-హైదరాబాద్‌, ఫలక్‌నుమా-హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి తదితర రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

రద్దైన రైళ్ల వివరాలు
లింగంపల్లి-ఉందానగర్‌ (47213)
ఉందానగర్‌-లింగంపల్లి (47211)
ఉందానగర్‌-సికింద్రాబాద్‌ (47246)
ఉందానగర్‌- సికింద్రాబాద్‌ (47248)
లింగంపల్లి-ఉందానగర్‌ (47212)
సికింద్రాబాద్‌-ఉందానగర్‌ (47247)
ఉందానగర్‌-సికింద్రాబాద్‌ (47248)
సికింద్రాబాద్‌-ఉందానగర్‌ (47249)
ఉందానగర్‌-లింగంపల్లి (47160)
లింగంపల్లి-ఫలక్‌నుమా (47188)
ఫలక్‌నుమా-లింగంపల్లి (47167)
లింగంపల్లి-ఉందానగర్‌ (47194)
లింగంపల్లి-ఉందానగర్‌ (47173)



Tags:    

Similar News