Sabarimala : శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. ఈ తేదీల్లో

బమరిమల వెళ్లేందుకు ఇరవై రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది

Update: 2023-11-21 04:23 GMT

అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. శబమరిమల వెళ్లేందుకు ఇరవై రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. శబరిమల కు ఈ నెల నుంచి భక్తులు క్యూ కడతారు. ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులు శబమరిమలకు చేరుకుంటారు. అందుకోసమే దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. వీటిలో ఫస్ట్, సెకండ్, ధర్ట్ ఏసీలతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు కూడా ఉంటాయని తెలిపింది.

22 స్పెషల్ ట్రైన్లు...
సికింద్రాబాద్ - కొల్లం వరకూ రైలు ఈ నెల 26న, డిసెంబర్ 3వ తేదీల్లో నడపనుంది. కొల్లం - సికింద్రాబాద్ రైలు ఈ నెల 28, డిసెంబరు 5వ తేదీన, నర్సాపూర్ - కొట్టాయం రైలు ఈ నెల 26న, డిసెంబరు 3న, కొట్టాంయం - నర్సాపూర్ రైలు ఈ నెల 27న, డిసెంబరు 4న, కాచిగూడ - కొల్లం ఈ నెల 9, 22, 29, డిసెంబరు 6న ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కొల్లం - కాచిగూడ రైలు ఈ నెల 24, డిసెంబరు 1, 8 తేదీల్లో, కాకినాడ - కొట్టాయం రైలు ఈ నెల 23, 30 తేదీల్లో, కొట్టాయం - కాకినాడ రైలు ఈ నెల 25, డిసెంబరు 2న, సికింద్రాబాద్ - కొల్లం రైలు ఈ నెల 24న, డిసెంబరు 1న, కొల్లం - సికింద్రాబాద్ రైలు ఈ నెల 25, డిసెంబరు 2వ తేదీన ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.


Tags:    

Similar News