తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జిగా సునీల్ బన్సల్ నియమితులయ్యారు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జిగా సునీల్ బన్సల్ నియమితులయ్యారు. ఆయన తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఉన్న ఇన్ ఛార్జి తరుణ‌్ చుగ్ స్థానంలో సునీల్ బన్సల్ ను కేంద్ర నాయకత్వం నియమించింది. రాజస్థాన్ కు చెందని సునీల్ బన్సల్ ఉత్తర్ ప్రదేశ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనను తెలంగాణ ఇన్‌ఛార్జిగా నియమించారు. సునీల్ బన్సల్ అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
ఎన్నికలు జరుగుతున్న వేళ...
ఎన్నికలు వచ్చే ఏడాది తెలంగాణలో జరుగుతున్నాయి. తరుణ్ చుగ్ ను తప్పించడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ఆయనను తప్పించి సునీల్ బన్సల్ ను నియమించడం వెనక అనేక కారణాలున్నాయని తెలిసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఉత్తర్‌ప్రదేశ్ లో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి సునీల్ బన్సల్ కారణమని భావించి తెలంగాణ ఇన్ ఛార్జిగా అధినాయకత్వం నియమించింది.