Bhatti Vikramarka: డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.;

Update: 2023-12-07 04:29 GMT
Bhatti Vikramarka, Revanth Reddy, CM, Bhatti, Telangana Congress
  • whatsapp icon

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌కు మంత్రుల జాబితా చేరింది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రయాణ స్వీకారం చేయనున్నారు. 

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీలు, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సభకు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు.. అందుకు తగ్గట్టుగానే భద్రతా ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News