Telangana : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు

Update: 2024-09-20 15:22 GMT

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా మిగిలిన శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకు లభించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. హైడ్రాకు 169 మంది సిబ్బందిని అదనంగా కేటాయించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

ఓఆర్‌ఆర్ లోపల ఉన్న...
మంత్రివర్గ సమావేశం ముగిసన తర్వాత మంత్రులు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఓఆర్ఆర్ లోపల ఇరవై ఏడు అర్బన్, స్థానిక సంస్థలున్నాయని, వాటిలో యాభై ఒక్క గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్ లో చేర్చడం జిగిందని మంత్రులు మీడియాకు తెలిపారు. మూడు వర్సిటీలకు పేరు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మహిళ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు యూనివర్సిటీకీ సురవరం ప్రతాప్ రెడ్డి, టెక్స్‌లైల్ హ్యాండ్‌లూమ్స్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ పేరును మంత్రి వర్గం ఖరారు చేసింది.


Tags:    

Similar News