శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకూ మెట్రో రైలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ మెట్రో రైలు విస్తరణకు అంగీకారం తెలిపారు. ఇందుకోసం 6,250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
సెకండ్ ఫేజ్ విస్తరణకు...
మొత్తం 31 కిలోమీటర్ల మేర సెకండ్ ఫేజ్ లో విస్తరించాలని నిర్ణయించారు. వచ్చే నెల 9వ తేదీన సెకండ్ ఫేజ్ మెట్రోకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీనివల్ల హైదరాబాద్ ప్రజలకు ప్రయాణం మరింత సులువవుతుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.