Revanth Reddy : జగన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముందు మీ చెల్లెళ్లు, తల్లి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఆయన కోరారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తనకు చంద్రబాబుకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని చెప్పారు.
ఇద్దరం వేర్వేరు...
గతంలో ఒక పార్టీలో పనిచేసినంత మాత్రాన ఇద్దరం ఒకటి కాదన్నది జగన్ గుర్తుంచుకోవాలన్నారు. తనకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. తనపై చేసిన ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని అన్నారు. ఏపీలో తాను వైెఎస్ షర్మిల ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.