హైదరాబాద్‌లో త్వరలో ఈకో టౌన్
హైదరాబాద్‌లో త్వరలో ఈకో టౌన్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమయింది.
హైదరాబాద్‌లో త్వరలో ఈకో టౌన్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమయింది. జపాన్ లో పర్యటిస్తున్న ఆయన జపాన్‌ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యర్థాలనిర్వహణ, పర్యావరణ పునరుద్ధరణలో భాగస్వామ్యంలో ఈ ఒప్పందం అమలు కానుంది. జపాన్‌కు నేరుగా విమాన సేవలు అందించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కిటాక్యూషూ మేయర్ కోరారు. గ్రీన్ ఇన్‌ఫ్రా కోసం కలిసి పనిచేయాలన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో జపనీస్ స్కూల్ కావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగారు.
వివిధ సంస్థలతో ఒప్పందాలు...
జపాన్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి బృందం పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణ పరిక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకునేలా ఈ ఒప్పందాలు చేసుకున్నాయి. నదుల పునరుజ్జీవ విధానాలపై కూడా కిటాక్యూషు మేయర్ తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. కిటాక్యూషు తరహాలో హైదరాబాద్ లో స్వచ్ఛమైన గాలి, వాతావరణం ఉన్న నగరం తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు ఇరువురి మధ్య ఒప్పందాలు కుదిరాయి. వారి అనుభవాలు విన్న రేవంత్ రెడ్డి కాలుష్య రహితమైన నగరంగా హైదరాబాద్ ను మార్చేందుకు సహకరించాలని కోరారు.