Revanth Reddy : సీఎం క్యాంప్ కార్యాలయంగా ఎంసీహెచ్‌ఆర్‌డీ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థను ఎంచుకునే అవకాశముంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థను ఎంచుకునే అవకాశముందని తెలిసింది. నిన్న ఆయన అక్కడ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. మొత్తం 45 ఎకరాల్లో విశాలమైన గదులు, ఆడిటోరియంతో పాటు ఇతర సౌకర్యాలు ఉండటంతో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఎంసీహెచ్ఆర్‌డీని ఉపయోగించుకోవాలని రేవంత్ యోచిస్తున్నారని తెలిసింది.
అన్ని వసతులతో...
ఇందులో 375 సెంట్రల్ ఏసీ గదులతోపాటు, పెద్ద కాన్ఫరెన్స్ హాలు కూడా ఉంది. ఇది నగరం మధ్యలో ఉండటం కూడా దీనిని సీఎం క్యాంప్ కార్యాలయంగా ఎంచుకుంటే మంచిదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే భవన్ గా మార్చిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇది అయితే తన ఇంటికి దగ్గరగా ఉండటమే కాకుండా సమీక్షలకు అనువుగా ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.