Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నేషనల్ హైవే అథారిటీ బృందంతో సమావేశం అవుతున్నారు;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నేషనల్ హైవే అథారిటీ బృందంతో సమావేశం అవుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లోని దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అధికారులతో చర్చించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
రీజనల్ రింగ్ రోడ్డుకు....
రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. అయితే భూ సేకరణ, అటవీ అనుమతులు, ఇతర అంశాలపై చర్చించేందుకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమావేశం కానున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదారాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు తీరతాయని ప్రభుత్వం త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సిద్ధమయింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now