Telangana : మూడో రోజు టోక్యో పర్యటనలో రేవంత్..పెట్టుబడుల వేట
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తున్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు అనేక కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. ప్రముఖ కంపెనీలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి బృందం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోనుంది. ప్రముఖ సంస్థలైన టయోయాట, తోషిబా, ఏసిస్, ఎన్టీటీ, కంపెనీల సీఈవోలతో ఆయన భేటీ జరగనుంది.
టోక్యో ప్రతినిధులతో...
అలాగే ఈ ఒప్పందాలు ముగిసిన వెంటనే టోక్యోలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం టోక్యో ప్రభుత్వ ప్రతినిధులతో ఆయన చర్చించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే రాయితీలు ప్రకటించే అవకాశముంది. జపాన్ పర్యటన ద్వారా అనేక ఒప్పందాలతో పెద్దయెత్తున చేసుకుని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది.