Revanth Reddy : జపాన్ పర్యటనకు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు

Update: 2025-04-16 02:28 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు నుంచి ఈ నెల 22వ తేదీ వరకూ రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు అధికారులు కూడా బయలుదేరి వెళ్లారు. జపాన్ లోని టోక్యో, మౌంట్ పుజి, ఒసాకా, హీరోషిమా లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది.

పెట్టుబడుల కోసం...
ఒసాకోలో జరగనున్న వరల్డ్ ఎక్స్ పో 2025లో ముఖ్యమంత్రి బృందం పాల్గొననుంది. అక్కడ తెలంగాణ పెవిలియన్ ను అక్కడ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులను పెట్టే అంశంపై చర్చించనున్నారు. సాంకేతిక సహకారంపై కూడా ముఖ్యమంత్రి బృందం నిపుణులతో చర్చించనుంది.


Tags:    

Similar News