Revanth Reddy : ఆదాయం తగ్గడానికి కారణం హైడ్రా కాదన్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని తెలిపారు. తాను కేసుల వ్యవహారంలో తలదూర్చనని తెలిపారు. తాను వ్యవస్థలను ఏనాడూ దుర్వినియోగం చేయనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలో నిజానిజాలు నిగ్గుతేలతాయనితెలిపారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని, ఆదాయం కోల్పోయామన్న వార్తల్లో నిజం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగయితే కరీంనగర్, వరంగల్ లో హైడ్రా ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
అవినీతి విషయంలో...
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్ విచారణ చేస్తుందని, అది పూర్తయిన తర్వాత కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్పారు. తాను కక్షపూరితంగా ఎవరిపైనా వ్యవహరించనని తెలిపారు. ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. పేద ప్రజల అభివృద్ధి, వారిసంక్షేమం కోసమే పనిచేస్తామన్న రేవంత్ రెడ్డి అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు వెలికితీయడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. అదానీతో తాను ఒప్పందం కుదుర్చుకుంటే బయటపెట్టాలంలూ రేవంత్ రెడ్డి విపక్షాలకు సవాల్ విసిరారు.