Telangana : ఎల్లుండి నుంచి రేవంత్ జపాన్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ దేశంలో పర్యటించనున్నారు;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ దేశంలో పర్యటించనున్నారు. ఈ నెల 16న జపాన్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 22 వరకు తెలంగాణ ప్రతినిధుల బృందం జపాన్ లో పర్యటిస్తుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమా లో ముఖ్యమంత్రి బృందం పర్యటించనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
పెట్టుబడుల కోసం...
రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జపాన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు సాధించే లక్ష్యంగా ఆయన తన బృందంతో కలసి పర్యటించనున్నారు. జపాన్ లోని ప్రభుత్వ అధికారులతో పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో కూడా రేవంత్ రెడ్డి బృందం సమావేశం కానుంది.