Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.;

Update: 2024-06-24 02:52 GMT
procedures, implement, rythu bharosa,  telangana
  • whatsapp icon

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటం, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆయన ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రుణమాఫీ ప్రక్రియను...
పార్టీ హైకమాండ్ నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. రైతు రుణమాఫీ ప్రక్రియని జులై నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించేందుకు సోనియా, రాహుల్, ప్రియాంకలను కూడా ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వారి చేతుల మీదుగానే రుణ మాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు మంత్రి వర్గ విస్తరణపై కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News