Revanth Reddy : ధరణిపై ఉన్నతస్థాయి కమిటీ.. నేడు రేవంత్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ధరణి పోర్టల్ పై సమీక్ష చేయనున్నారు;

dharani portal
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ధరణి పోర్టల్ పై సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. ధరణి స్థానంలో కొత్తది తెస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది.
ధరణి ప్లేస్‌లో...
ధరణి స్థానంలో కొత్త పోర్టల్ ను తెస్తామన్న ఇచ్చిన హామీని అమలు చేసే పనిలో భాగంగానే రేవంత్ రెడ్డి దీనిపై ఈరోజు సమీక్ష చేయనున్నారు. ధరణి లో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి సయితం ఎన్నికల వేళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ అనుచరులకు భూములను కట్టబెట్టడం కోసం ధరణని తెచ్చారని కూడా విమర్శలు చేశారు. ఈరోజు సమీక్ష తర్వాత ధరణిపై కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.