Revanth Reddy : నేడు కూడా జపాన్ లోనే రేవంత్ బృందం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ లో పర్యటిస్తుంది

Update: 2025-04-19 04:17 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ లో పర్యటిస్తుంది. ఇప్పటికే పలు ముఖ్యమైన పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న రేవంత్ రెడ్డి బృందం నేడు కూడా దేశంలో పర్యటిస్తూ పెట్టుబడుల వేటను కొనసాగించనుంది. గత మూడు రోజుల నుంచి రేవంత్ రెడ్డి బృందం దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతూ వారితో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు.

ఈరోజు కూడా పలు పారిశ్రామిక సంస్థలతో...
ఈరోజు కూడా పలు పారిశ్రామిక సంస్థలతో రేవంత్ రెడ్డి బృందం సమావేశం కానుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అవరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, రాయితీలు ఇస్తామని ప్రకటించనుంది. దీంతో పాటు ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్టు వివరాలను కూడా వారికి చెప్పి మెప్పించి ఒప్పించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి బృందం ఉంది. నేడు కూడా పలు సంస్థలతో కీలక ఒప్పందాలు జరగనున్నాయి.


Tags:    

Similar News