నేటితో ముఖ్యమంత్రి రేవంత్ జపాన్ పర్యటన ముగింపు

నేటితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జపాన్‌ పర్యటన ముగియనుంది.

Update: 2025-04-22 02:33 GMT

నేటితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జపాన్‌ పర్యటన ముగియనుంది. నేడు హిరోషిమాకు సీఎం రేవంత్‌రెడ్డి బృందం చేరుకుంటుంది. పీస్ మెమోరియల్‌ను సందర్శించనున్న ముఖ్యమంత్రి బృందం గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారకు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి బృందం సమావేశంకానుంది.

రేపు ఉదయం...
హిరోషిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సందర్శన చేసిన అనంతరం మజ్దా మోటార్స్‌ ఫ్యాక్టరీ సందర్శించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనంరేపు ఉదయం హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చేరనుంది. గత కొద్ది రోజులుగా జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పలు ఒప్పందాలను చేసుకుంది. పెట్టుబడులకు సంబంధించి అగ్రిమెంట్లను చేసుకుంది.


Tags:    

Similar News