మేడారం జాతరకు కోటి మంది భక్తులు
మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలిపారు.
మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలిపారు. మేడారంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
అన్ని చర్యలు....
ప్రధాన ఆసుపత్రితో పాటు 35 హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నామని చెప్పారు. 327 ప్రాంతాల్లో 627 మరుగుదొడ్లను నిర్మించామని చెప్పారు. మేడారం జాతరకు వెళ్లేందుకు ప్రత్యేకంగా 3850 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి శాఖకు చెందిన అధికారి మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.