సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. సీడబ్ల్యూసీ సమావేశాలలో

Update: 2023-12-21 08:59 GMT

 revanth reddy delhi tour

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లాలని భావించారు. మరో వైపు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి సభకు వచ్చి ఆ తర్వాత మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు ఢిల్లీ పర్యటన రద్దయిందని అధికారిక ప్రకటన వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి బదులుగా.. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఇన్వైటీ వంశీచంద్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో ఇటీవలి వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి పాల్గొననున్నారు.

ఇక విద్యుత్ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. తమ గత ప్రభుత్వంపై ప్రస్తుత ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ సభ్యుడే డిమాండ్ చేశారు కాబట్టి జ్యుడీషియల్ విచారణ జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయిస్తామని చెప్పారు.



Tags:    

Similar News