నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ లకు సంబంధించిన కోర్సుల్లో ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అడ్మిషన్లు..

Update: 2023-05-25 02:59 GMT

ts eamcet results

లక్షలాది మంది విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. నేటి ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి వి.కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషన్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్ లోని గోల్డెన్ జూబ్లీ హాల్ లో ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ లకు సంబంధించిన కోర్సుల్లో ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. విద్యార్థులు తమ ఫలితాలను చూసుకునేందుకు eamcet.tsche.ac.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా.. వాటిలో 3,01,789 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా.. 65,871 మంది పరీక్షలు రాశారు.


Tags:    

Similar News