వాకర్ ఆధారంగా నడుస్తున్న కేసీఆర్

హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్సను నిర్వహించి

Update: 2023-12-09 09:32 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయింది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయింది. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్సను నిర్వహించి, స్టీల్ ప్లేట్లను అమర్చారు. ఆయన వాకర్ ఆధారంగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన నడవడాన్ని వైద్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు.

శుక్రవారం నాడు కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయనకు శస్త్రచికిత్స విజయవంతమైనట్లు యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఎనిమిది వారాల్లో ఆయన కోలుకుంటారని తెలిపారు. యశోద హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. మాజీ ముఖ్యమంత్రి శస్త్రచికిత్సను బాగా తట్టుకున్నారు. ప్రక్రియ అంతటా హేమోడైనమిక్‌గా స్థిరంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ను ఒక గదికి తరలించారని, అక్కడ ఆయన కోలుకుంటున్నాడని ఆసుపత్రి యంత్రాంగం తెలిపింది.



Tags:    

Similar News