నేడు జాతీయ సమైక్యత దినోత్సవం

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నేడు ప్రభుత్వం జరపనుంది. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు

Update: 2023-09-17 03:05 GMT

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నేడు ప్రభుత్వం జరపనుంది. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సెప్టంబరు 17న విమోచన దినోత్సవం కాకుండా సమైక్యత దినోత్సవాన్ని జరపాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఉదయం పదకొండు గంటలకు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

జిల్లాల్లో మంత్రులు...
ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా సెప్టంబరు 17న జాతీయ సమైక్యత దినోత్సవంగా ప్రభుత్వం జరుపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లాల్లో మంత్రులు పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు ప్రజలకు వివరించనున్నారు.


Tags:    

Similar News