Tealngana : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
సీరియస్ కావడంతో...
ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి వెళ్లిన కలెక్టర్ పై స్థానికులు దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి అనేక మందిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దీనిపై కొందరిరిన అరెస్ట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం తనంతట తానే రద్దు చేసుకుంది.