Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీచర్లకు బ్యాడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2024-09-19 08:15 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు క్లాస్‌ రూమ్‌లోకి ఫోన్ తీసుకెళితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. టీచర్లు తరగతి గదుల్లోకి ఎలాంటి సెల్‌ఫోన్‌లను తీసుకెళ్ల కూడదని విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తరగతి గదుల్లోకి ఫోన్లను తీసుకెళితే అది చదువుకు భంగం కలుగుతుందని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

తరగతి గదుల్లోకి...
అయితే ఇప్పటికే సెల్‌ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకెళ్ల కూడదని ఆదేశాలున్నప్పటికీ కొందరు టీచర్లు వాటిని క్లాస్‌ల్లోకి తీసుకెళుతూ ప్రభుత్వ ఆదేశాలను థిక్కరిస్తున్నారని పేర్కొంది. ఈ విషయం కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి కావడం, తరగతి గదుల్లో ఎక్కువ సమయం ఫోన్లతోనే గడుతుపుతుండటాన్ని గుర్తించిన విద్యాశాఖ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఫోన్లు తరగతి గదుల్లోకి తీసుకుని వెళ్లాలంటే ఖచ్చితంగా హెడ్ మాస్టర్ అనుమతి తీసుకోవాలని చెప్పింది. లేకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.


Tags:    

Similar News