ఆ వార్తలు అవాస్తవం.. నేను సంతోషంగా ఉన్నా: తమిళిసై
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. తమిళనాడు నుంచి ఆమె పోటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే!! అయితే ఆమె మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. తమిళిసై సౌందరరాజన్ మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారని.. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసమే చేయాలనే విషయాన్ని అధిష్టానానికి చెప్పాలనుకున్నారని వార్తలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని వార్తలు వచ్చాయి.
ఈ కథనాల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని, గవర్నర్‌గా రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై సౌందర్ రాజన్ స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దన్న గవర్నర్.. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అన్ని విషయాలు తెలియజేస్తానని క్లారిటీ ఇచ్చారు. తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. భారతీయ జనతా పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన బీజేపీ 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.