ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో పరీక్షల వత్తిడిని తగ్గించేందుకు సిద్ధమయింది.

Update: 2023-03-07 06:28 GMT

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో పరీక్షల వత్తిడిని తగ్గించేందుకు సిద్ధమయింది. ఇందుకోసం టెలిమానస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల్లో పరీక్షలంటే భయపోగొట్టడం, వారిని ఆందోళనకు గురి చేయకుండా చేయడమే టెలిమానస్ లక్ష్యమని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

టెలిమానస్ ద్వారా...
పరీక్షల వేళ ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో ప్రభుత్వం టెలి మానస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు సైకాలజిస్టుతో సేవలందించేందుకు సిద్ధమయింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సైకాలజిస్టులు ఉచితంగా ఈ సేవలను అందించనున్నారని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఆందోళనకు గురైన వారు సైకాలజిస్టులను కలసి వారి సలహాలను తీసుకోవచ్చని పేర్కొన్నారు.


Tags:    

Similar News