న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
తెలంగాణ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఆంక్షలను కఠినతరం చేశారు.
తెలంగాణ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఆంక్షలను కఠినతరం చేశారు. ప్రభుత్వం మద్యం దుకాణాలకు రాత్రి 12 గంటల వరకూ, పబ్ లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు రాత్రి 1 గంట వరకూ అనుమతి ఇచ్చింది. అయితే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాత్రం న్యూ ఇయర్ వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.
డీజేలకు నో పర్మిషన్....
ఈ నెల 31వ తేదీ రాత్రి డీజీలకు ఎటువంటి అనుమతి లేదని చెప్పారు. అలాగే పబ్ లు, రెస్టారెంట్లు పక్కన ఉన్న స్థానికులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ చెప్పారు. ఎవరికీ ఇబ్బందికలగకుండా న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించుకోవాలని సీవీ ఆనంద్ సూచించారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకూ ఫ్లై ఓవర్ లు మూసివేస్తామని సీవీ ఆనంద్ చెప్పారు.