గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పార్టీలను చిత్తు చేయడానికి తన ప్రణాళికల్లో తాను ఉన్నారు.

Update: 2023-05-29 02:47 GMT

cm kcr

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ నే ఓడించాలని ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి ప్రతి పక్షాలు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో క్షేత్ర స్థాయి నుండి బలోపేతం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. బీఆర్ఎస్, బీజేపీలను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక కర్ణాటకలో ఓటమిని అందుకున్నప్పటికీ ఆ ప్రభావం తెలంగాణలో ఉండదని బీజేపీ నేతలు ఎంతో కాన్ఫిడెంట్ గా చెబుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ ను ఎదుర్కోడానికి కాంగ్రెస్, బీజేపీలు సర్వసన్నద్ధం అవుతూ ఉన్నాయి.

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పార్టీలను చిత్తు చేయడానికి తన ప్రణాళికల్లో తాను ఉన్నారు. బలమైన నాయకులను దింపాలని ఆయన యోచిస్తూ ఉన్నారు. ఏయే ప్రాంతాలలో కాంగ్రెస్, బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్నాయని అనుకుంటున్నారో.. ఆయా ప్రాంతాలలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలను దింపాలని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో బలమైన నేతల కోసం ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయనను ఢీకొట్టడానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే టి.నరసా రెడ్డిని రంగంలోకి దింపే అవకాశం ఉంది. ఇంతకు ముందు కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఒంటేరు ప్రతాప రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరారు.
సిద్దిపేటలో గత ఎన్నికల్లో 1.2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావును ఓడించడం కష్టమే అని అందరికీ తెలిసిందే. రెండు ప్రత్యర్థి పార్టీలకు ఆయనపై పోటీ చేసే అభ్యర్థులు లేరు. కాంగ్రెస్, బీజేపీ దృష్టి సారించిన మరో అసెంబ్లీ స్థానం సిరిసిల్ల. ఇక్కడ మంత్రి K T రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామారావుకు బలమైన ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు మహేందర్‌రెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. గత ఎన్నికల్లో సీఎం కుమారుడు 89,009 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం. ఇక బీజేపీకి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి లేరు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి కంచుకోటగా ఉన్న అంబర్‌పేట అసెంబ్లీలో ఆయన గతసారి ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో మళ్లీ పట్టు సాధించాలని ఆయన తహతహలాడుతున్నట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌.. కిషన్‌రెడ్డికి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు లేకపోవడంతో కిషన్‌, వెంకటేష్‌ల మధ్య పోరు సాగుతోంది
2018లో కొండగల్‌ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో 9,319 ఓట్ల తేడాతో ఓడిపోయిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి లోక్‌సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం ఎంపికపై పలు ఊహాగానాలు వచ్చాయి. కొడంగల్, మల్కాజిగిరి లలో ఆయన ఎక్కడ నుండి పోటీ చేస్తారో తెలియాల్సి ఉంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అసెంబ్లీలో రెండుసార్లు ఓడిపోవడంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని అధికార పార్టీ నేతలు కూడా కాంగ్రెస్‌, బీజేపీలకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచిస్తున్న నేపథ్యంలో పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన కె.ఉపేందర్‌ రెడ్డి ఆ తర్వాత అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు.


Tags:    

Similar News