షర్మిల చేరిక రేణుక చౌదరికి అసలు ఇష్టం లేదాయె

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల తెలంగాణలో

Update: 2023-06-23 11:21 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని పెట్టి పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ఊహాగానాలు ఉధృతమయ్యాయి. ఈ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్ షర్మిల రాజకీయ అవకాశవాదానికి పాల్పడుతున్నారని రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టిపి విలీనం కాంగ్రెస్ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గంగా నదిలాంటిదని, ఇందుకు స్నానం చేయడానికి అందరూ వస్తారని ఆమె చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దామంటూ ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి గురించి, మా నాయకుల గురించి తప్పుగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా పార్టీలో తన పార్టీని విలీనం చేయాలనుకోవడం వెనుక కొత్తగా ఏ జ్ఞానోదయం అయ్యిందో అని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లోకి ఎవరు వచ్చినా వారికే ప్రయోజనమని ఆమె చెప్పారు.

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి దగ్గరవబోతున్నారనే ప్రచారం ఈ మధ్య కాలంలో ఊపందుకుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసి షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు ఆమె కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయబోతున్నారని మొదలైన ప్రచారం ఇంకా కొనసాగుతూ ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఇదే విషయమై చర్చించారని, విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


Tags:    

Similar News