నేటి నుంచి టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు
తెలంగాణ ఆర్టీసీ నేటి నుంచి స్లీపర్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తేనుంది.;
తెలంగాణ ఆర్టీసీ నేటి నుంచి స్లీపర్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తేనుంది. తొలి సారిగా పది స్లీపర్ బస్సులను ప్రయాణికుల సౌకర్యం కోసం టీఎస్ఆర్టీసీ సిద్ధం చేసింది. వీటిలో నాలుగు స్లీపర్ బస్సులు కాగా, ఆరు స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈరోజు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఏపీకి మాత్రమే....
ఈ బస్సులు హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడల మధ్య తిరగనున్నాయి. కేపీహెచ్‌బీ బస్ స్టాప్ వద్ద సాయంత్రం నాలుగు గంటలకు బాజిరెడ్డి గోవర్థన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లు ప్రారంభించనున్నారు. సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులకు ఈ బస్సులు సౌకర్యంగా ఉంటాయని, ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. విజయవాడకు ఉదయం 9.30 గంటల నుంచే బయలుదేరేలా నిర్ణయం తీసుకున్నారు.