నేడు ఖమ్మంకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు చంద్రబాబు ఈ పర్యటనను ఎంచుకున్నారు. ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. మరికాసేపట్లో రోడ్డుమార్గాన బయలుదేరనున్న చంద్రబాబు హబ్సిగూడ, ఉప్పల్, ఎల్బినగర్, హయత్ నగర్ ల మీదుగా టేకుమెట్ల వంతెన వద్దకు చేరుకుంటారు.
చేరికలు...
మధ్యాహ్నం 2.30 గంటలకు కేశవాపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం చేరుకుంటారు. మయూరి జంక్షన్ నుంచి ర్యాలీగా సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీలో కొందరు నేతలు చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడలోని తన నివాసానికి చేరుకుంటారు.