Weather Alert : నేడు, రేపు జాగ్రత్తగా ఉండండి !
ఎండలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప..
హైదరాబాద్ : నేడు, రేపు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ రెండ్రోజుల్లో భానుడు ప్రచండుడై.. నిప్పులు చెరగనున్నాడని హెచ్చరించింది. ఎండలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని తెలిపింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇంటిపట్టునే ఉండటం మంచిదని వాతావరణశాఖ తెలిపింది. అలాగే కొన్నిప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కాగా.. నిన్న కూడా తెలంగాణలో భానుడు భగభగమండుతూ.. నిప్పులు చెరిగాడు. ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే కావడం గమనార్హం. మరో 10 జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల నుంచి 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.