ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకూ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకూ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి హాల్‌టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ పరీక్ష జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
ఆరు పరీక్షలే...
అయితే ఈసారి పదో తరగతి పరీక్షలు ఆరు ప్రశ్నాపత్రాలకే పరిమితం చేశారు. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్స్ కు 4.94,416 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షలకు మూడు గంటల సమయం కేటాయించిన విద్యాశాఖ సైన్స్ పరీక్షకు మాత్రం 3.20 గంటలు కేటాయించింది. విద్యార్థులు ఈ నెల 24వ తేదీ నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.