Breaking : కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

నేడు కవిత బెయిల్ పిటీషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది

Update: 2024-04-23 08:45 GMT

నేడు కవిత బెయిల్ పిటీషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఆమె బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపింది. కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో పథ్నాలుగు రోజులు పొడిగించింది. మే ఏడో తేదీ వరకూ కవితకు రిమాండ్ విధించింది.  కవితను వర్చువల్ గా న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.  నిన్న సీబీఐ కేసులో బెయిల్ పై విచారణ జరిగింది. విచారణలో ఇరువర్గాల వాదన విన్న న్యాయమూర్తి తీర్పును మే 2వ తేదీకి రిజర్వ్ చేశారు. 

తీహార్ జైలులో...
గత నెల 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉందని ఈడీ తరుపున న్యాయవాదులు గట్టిగా వాదిస్తున్నారు. కవిత సౌత్ లాబీ నుంచి వంద కోట్ల రూపాయల ముడుపులను సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశారు. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.మరో పథ్నాలుగు రోజుల పాటు కవిత తీహార్ జైలులోనే ఉండనున్నారు. 


Tags:    

Similar News