వైఎస్ షర్మిలపై స్పీకర్ కు ఎమ్మెల్యేల ఫిర్యాదు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. తమపై నిరాధార ఆరోపణలను చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ ఫిర్యాదు చేశారు.
పాదయాత్రలో విమర్శలపై...
వైఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఆమె పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేేసిన సభల్లో మంత్రులు, ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలపై స్పీకర్ కు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.