కేసినో కేసు : నేడు ఈడీ ముందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుటకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ నేడు విచారణకు హాజరుకానున్నారు

Update: 2022-11-18 05:06 GMT

కేసినో కేసులో ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుటకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఆయనకు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రమణతో పాటు డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి కూడా నేడు హాజరు కానున్నారు.

ఫెమా నిబంధనలను....
ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని, మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ వీరిని విచారిస్తుంది. హవాలా చెల్లింపులపై కూడా విచారణ ేయనుంది. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులను విచారించిన ఈడీ మరికొంత మందిని విచారించేందుకు సిద్ధమవుతుంది. నేపాల్ కు వెళ్లిన వంద మందిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసి విచారించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్ణయించింది.


Tags:    

Similar News